Gallery

Events

Vana Mahotsavam at Madhavanji Integrated Health City

పత్రికా ప్రకటన
 
తేదీ: 25 ఆగస్టు 2026
                                  9వ వనమహోత్సవం 2026: మాధవన్ జి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీలో పచ్చదనం పండుగ
 
మాధవన్ జి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం స్ఫూర్తితో, మాధవన్ జి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీలో 9వ వనమహోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. 2018 నుండి నిరంతరాయంగా ప్రతి సంవత్సరం వనమహోత్సవాన్ని నిర్వహిస్తూ పచ్చదనం పెంపుదలకు కృషి చేస్తున్న ఏకైక హెల్త్ సిటీ మాధవన్ జి కావడం విశేషం.
ఉదయం 12 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం…
ఉదయం 12 గంటలకు అటవీ శాఖ అధికారులు క్యాంపస్ కు చేరుకోగానే, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. తరుణ్ గారు, సీఈఓ డా. బి. శేషాద్రి గారు, జనరల్ మేనేజర్ కె. గణేష్ గారు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం క్యాంపస్ ప్రధాన గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది.
1. ప్రారంభ మొక్కలు నాటిన అటవీ అధికారులు:
మొదటగా షంషాబాద్ FDO శ్రీ ఆర్. వెంకటయ్య గారు ఒక పండ్ల మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంఖాల్ FRO శ్రీ జె. ప్రభాకర్ గారు, డిప్యూటీ RO శ్రీ కె. రాజేందర్ రెడ్డి గారు వేప, రావి మొక్కలను నాటారు.
2. యాజమాన్యం, విద్యార్థుల భాగస్వామ్యం:
అటవీ అధికారుల తర్వాత MD తరుణ్ గారు, CEO శేషాద్రి గారు, డైరెక్టర్ హరిప్రసాద్ గారు, నర్సింగ్ ప్రిన్సిపల్స్ స్వాతి, శ్వేత గారు,B.Ed. ప్రిన్సిపల్ హనుమంతరావు గారు, ఎస్టేట్ మేనేజర్ వెంకన్న గారు మొక్కలు నాటి నీళ్లు పోశారు. నర్సింగ్ విద్యార్థినులు స్వయంగా గుంతలు తవ్వి మొక్కలు నాటడం అందరినీ ఆకట్టుకుంది.
అతిథుల సందేశం:
శ్రీ ఆర్. వెంకటయ్య గారు (FDO, షంషాబాద్) మాట్లాడుతూ “ఒక మనిషి జీవితంలో కనీసం 10 మొక్కలు నాటాలి. మాధవాంజి సంస్థ ఇలా ప్రతి ఏడాది వనమహోత్సవం నిర్వహించడం అభినందనీయం. మీరు నాటిన ప్రతి మొక్కకు ఒక విద్యార్థి పేరు పెట్టి బాధ్యత అప్పగిస్తే, ఆ మొక్క 100% బ్రతుకుతుంది” అని సూచించారు.
శ్రీ పి. తరుణ్ గారు (MD) మాట్లాడుతూ “హెల్త్ అంటే కేవలం హాస్పిటల్ కాదు, హెల్తీ ఎన్విరాన్మెంట్ కూడా. మా హెల్త్ సిటీ పరిసరాల్లో ఇప్పటివరకు 5000కు పైగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాము. ఈ ఏడాది మరో 1000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని తెలిపారు.
చివరగా అందరు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, నాన్-టీచింగ్ స్టాఫ్, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.